Showing posts with label ఉసరికాయ. Show all posts
Showing posts with label ఉసరికాయ. Show all posts

Monday, 2 November 2009

బ్లాగ్వనంలో వనభోజనాలు (ఉసరికాయ )

కార్తీక మాసం.. పొద్దున్నె లేవడాలు.. శివాలయాలు దీపాలు వనభోజనాలు.. అన్ని జ్ఞాపకాలైపోయాయి.
జ్యోతి గారి వనభోజనాల ఐడియా చాలా బాగుంది .
కనీసం onlinelO అయినా నా ఇంట్లో మీ అందరికి రుచికరమైన ఆరోగ్యకరమైన భోజనం పెడుతున్నందుకు ఆనందంగా vundi.
కార్తీక మాసంలో ఉసరికాయ తప్పకుండా తినాలని మా అమ్మమ్మ చెప్పే వారు.ఆమె మంచి రుచిగా ఉసరికాయ పచ్చడి కుడా చేసేవారు.ఇప్పుడు మనకు అన్ని ఇన్స్టంట్ గా కావాలి కదా,అందుకే నేను ఇన్స్టంట్ ఉసరికాయ పచ్చడి చేస్తున్నా.
దిన్ని మాపక్క ఉసరికాయ ఉడుకు ఉరగాయ అంటారు.దీనికీ కావలసిన పదార్ధాలు ౬-౮ ఉసరికాయలు
ఒక స్పూన్ మెంతులు
ఒక స్పూన్ ఆవాలు,
ఒకటిన్నార స్పూన్ కారం పొడి
అర స్పూన్ పసుపు
రుచికి తగ్గ ఉప్పు
ఒక స్పూన్ నిమ్మరసం
పోపుకు ఆవాలు ౨-౩ ఎందు మిర్చి ,ఇంగువ
నూనె


ముందుగా ఉసరికాయలు బాగా కడిగి ,తడిలేకుండా తుడుచుకోవాలి.
తర్వాత ఒక అడుగు మందంగా వున్నా గిన్నెలో ఆవాలు,మెంతులు వేసి వేయించాలి వీటిని పొడి కుడా చెయ్యాలి.
అదే గిన్నేలోనే ౨ స్పూన్ల నూనె వేసి అందులో ఉసరికాయలు వేసి ఒకసారి కలపాలి .తర్వాత ఉప్పు వేసి కొంచం నీరు పోసి మూత పెట్టి కాయలు బాగా మెత్తగా అయ్యేవరకుఉడకనివ్వాలి .తర్వాత వేరొక గిన్నె లో మిగిలిన నూనె వేసి ఆవాలు ,ఎందు మిర్చి ఇంగువ కారం పొడి, ఆవాల మెంతి పొడి వేసి పోపు పెట్టాలి .ఈ పోపును ఉడికిన ఉసరికాయలకు చేర్చి బాగా కలపాలి.ఒక ౨ నిముషాలు సన్నని మంటపై పెట్టి తీసేసి చివరగా నిమ్మరసం కలిపితే ఉసరికాయ ఉడుకు ఉరగాయ రెడీ .
తలచుకుంటేనే నోట్లో ...............హమ్మ .......
దిన్ని అన్నం లోకి చపాతిలోకి కుడా తినవచ్చు.
చిన్నప్పుడు ఈ ఉసరికాయలకు ఒక చిన్న పుల్ల చెక్కి లోల్ల్య్పోప్స్ లాగా తినేవాళ్ళం .తినేకోద్ది రుచిగా వుండేవి.
మీకందరికీ ఈ వ్యంజనం నచ్చిందని ఆశిస్తూ...

కృష్ణుడు .