Monday 14 April 2008

భర్తృహరి సుభాషితము

కేయూరాణి నభూషయంతి పురుషం హారాన చంద్రోజ్వలాంనస్నానం నవిలేపనం న కుసుమం నలాంకృతామూర్ధజాంవాణ్యేకా సమలంకరోతి పురుషం యాసంస్కృతా ధార్యతేక్షీయంతేఖిలభూషణాని సతతం వాక్భూషణం భూషణం
మానవులకు చంద్రకాంతితో సమానంగా ప్రకాశించే దండలు కాని,భుజకీర్తులు కానీ, స్నానాలు,పైపూతలు పూలు వారి భుజాలను అలంకరించలేవు.ఎటువతి వాక్కు అయితే సంస్కృతాన్ని ధరించి వుంటుందో అటువంటి ఒక్క వాక్కు మాత్రమే సరిగ్గా అలంకరిస్తుంది.అన్నీ ఆభరణాలు నశించి పోతాయి కానీ ఒక్క మాట మాత్రమే శాశ్వత ఆభరణంగా వుంటుంది మానవులకు.
నాకు చాలా చాల ఇష్టమైన శ్లోకం చిన్నప్పటినుండి.రేడియోలో వచ్చె ఈ శ్లోకం కోసం చాలా ఎదురుచూసేదాన్ని నా చిన్నప్పుడు.మా పాపకు నేర్పించి చాలా రోజులయ్యింది.కానీ ఇప్పుడు తీరికయ్యింది లింకు అప్లోడు చెయ్యడానికి.
http://www.youtube.com/watch?v=M8RfcrWE9wU

5 comments:

గిరి Giri said...

చాల బావుంది.

వికటకవి said...

ఓ మీ అమ్మాయేనా, ఇదివరకే చూసాను. మంచి శ్లోకం నేర్పించారు. బాగుంది.

krishna said...

Thnak you Giri gaaru and vikatakavi gaaru.

రాఘవ said...

మా మేనకోడలిని చక్కగా పెంచుతున్నారు :)

krishna said...

రాఘవ గారు,

మీలాంటి మేనమామల ఆశీర్వాదములు ఉంటె అంతేచాలు.