Saturday 14 June 2008

కారేట్ హల్వా

ఇనాయకసామికిుఎప్పుడu పాయసాలు దద్ధోజనాలు కుడుములూ తిని తిని పాపం ఇసఉగ్గా వుండాదంట ంగందుకే స్పెసలుగా ఈయాల కారెట్ హల్వ జేసి పెడితె సామికి భలె నచ్చి నాగోరికలన్ని తిర్చిన్డాడు మరి మీకు గుడా యామన్న గోరికలుంటె ఇగ్గో ఈడ జెప్పినట్లు ఓ పారి ఈకారెట్ హల్వ పెట్టి జూడంది మీగోరికలన్నీ తీర్తాయి.ముందుగల్గనే జెప్తున్న మల్ల నన్ననవాకండి మీబత్తిని గుడక సామిజూత్తాడు.

ఔ నేను తెల్దుగదా మీకి నా పేరు సుబ్బమ్మ.అదె సుబ్బలచ్చిమి.మాది రాయలసీమ.అట్ల బయపడమాకండి .ఈడ గుడా అందురూ శానా మంచోల్లు పాపం అంతా పెదొల్లు .

సర్లే గాని హల్వాకి యామెంగావాలో జెప్తా జూసుకోండి ...అబ్బ మీక్తెలిసినా మల్ల మతికి జేస్కోండి గెందుకంటె నేన పాలెయ్యను హల్వలేకి మరదె సీక్రెట్టంటె .పాలబడితే బిరీన పాదైపొతుంది మరి .మరిప్పుడు జేస్కోండి మీకొచ్చినట్లు ఇంగ నెనెందుకూ మల్ల రాయల్ల అబ్బ జెయ్యి నొప్పిలెస్తాంది .
ఐనాగుడక జెప్పాల్న అయితె ఎమిలా అదె కారెట్ని తురుముకోని బాండ్లిలో బాగా అర్దం కప్పుగిన్నె నెయ్యిలో యెయించి పక్కనబెట్టాల దాంట్లెకి గోడంబి ద్రచ్చ గుడక యేసి యెయించాల అది గుడ్క పక్కనబెట్టి ఆ బాండ్లిలేకి సక్కిర నీల్లు బోసి తీగపాకం బట్టాల మల్ల పొయి మంట సన్నగజేస్కోని అగ్గొ యెపుకున్న కారెట్ తురుము గోడంబి ద్రాచ్చ యెసి బాగ కలగబె్ట్టల మల్ల దించెయాల .మీగాల్లంటె అదెంది వాసనొచ్చెది ఆ య్ాలక్కులుగుదక పొడి జేసి యెస్కోచ్చు .
సల్లగ గాల్లంటెస్ అల్లగ యేడిగాల్లంటె యేడిగ తినండి. ఆ మల్ల మర్చిబోవాకండి ఇనాయక సామికి బెత్తేది.

ఇంగ నేపోయోత్తా ఈతురి మల్ల ఏమన్నా కొత్తోంతలు జేపుతా.అన్తోరకు గుండండి.

3 comments:

రాఘవ said...

మీకీ సీమమాండలికం బానే వచ్చినట్టే ఉంది. కానీ ఒకటి మాత్రం నిజం. నాకైతే "సరిగా సమజైతలే". ముద్రారాక్షసాలు ఉన్నాయేమో అనిపించింది. ుఎప్పుడu, ఇసఉగ్గా, య్ాలక్కులు ... "గిట్ల"!

బిరీన? బాండ్లి అంటే బాణలా? గోడంబి? ఈ తురి అంటే ఈ సారి అనా?

krishna said...

ఔనండి అన్ని ఆయుధాలుపయోగించినా తెలుగు రాయడానికి ఈ ముద్రారాక్షసాలనుండి తప్పించుకోలేక పోతున్నాను.
బిరీన బేగ ,బేగి అంటే త్వరగా అని గోడంబి అంటె జీడి పప్పు
మిగతావి రెండూ అవె అర్థాలు.

రాఘవ said...

మీరు హాయిగా inscript పద్ధతిలో వ్రాయొచ్చుగా... అప్పుడీ తప్పుల తిప్పలు తప్పును.