Wednesday 11 June 2008

చాక్లెట్ ............. ముద్దు

నాన్న:పాపా ఇదిగోమ్మా చాక్లెట్.

పాప:మ్మ్మ్ యమ్మీ ఇన్ మై టమ్మీ.

(ముద్దు పెట్టింది పాప నాన్న చెంప మీద.)

నాన్న:ఎందుకమ్మా ముద్దు పెట్టింది?

పాప:మరి నువ్వు ఆఫీస్ నుంచి చాక్లెట్ తెచ్చిచ్చావు కదా అందుకు.

నాన్న :మరి చాక్లెట్ తెచ్చివ్వకపోతె ముద్దు పెట్టవా..?

పాప:హ్మ్మ్ అప్పుడు కూడా పెడతాను..రేపు కూడా ఆఫీస్ నుంచి చాక్లెట్ తెచ్చివ్వడానికి..

నాన్న:ఆయ్

2 comments:

Sujata M said...

ఏమనుకోవద్దు - 'రేపు కూడా' ఎలా తెచ్చేఇస్తారు చాక్లేట్ - 'ఈ రోజు తేక పొతే ?!' అని డౌట్.
రెండో డౌట్ : 'నౌకా చరితం' అంటే ఏమిటి ? (మీకు ఇష్టమైన మ్యూజిక్ అని రాసారు)

krishna said...

సుజాత గారు,
నాకు మీ మొదటి సందేహం సరిగా అర్థం కాలేదు.
రేపు కూడా చాక్లెట్ తెచ్చివ్వడానికి పాప ముందే అంటె ఈరోజే ముద్దు పెట్టింది వాళ్ళ నాన్నకు అని.

"నౌకాచరితం " అంటే త్యాగరాజస్వామి రాసిన ఒక యక్షగానము. శ్రీకృష్ణుడి రాసలీలలను వర్ణిస్తూ కొన్ని పద్యాలు,పాటలు .దానిలో కృష్ణుడు ,గోపికలు యమునానదిలో పడవ మీద లీలను వర్ణిస్తారు.ఇది ఎక్కువగా నృత్యానికి వుపయొగించుకుంటారు యక్షగానమవడం వల్ల.

నౌకాచరితమ్ను ఇక్కాడ చూడొచ్చు.
http://www.andhrabharati.com/dEshi/yaxagAnamulu/naukAcharitramu.html